News March 18, 2025
మహబూబ్‌నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.
Similar News
News March 19, 2025
MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS
News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.
News March 19, 2025
MBNR: GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.