News May 25, 2024
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో గెలుపెవరిది..?

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత MBNR పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై కాంగ్రెస్, BJP, BRS పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ MLAలు ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలతో తమ గెలుపు ఖాయమని BJP నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో BRS నామమాత్రంగానే బరిలోకి దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News January 1, 2026
MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31stన మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లతో పాటు ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. మొత్తం 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని వెల్లడించారు.
News January 1, 2026
MBNR: రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మధుసూదన్ నాయక్ 37వ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నినాదాలు, పోస్టర్లతో అలంకరించిన వాహనంను పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..రవాణా శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి నెలరోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
News January 1, 2026
క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: SP

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. SP జానకి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. నూతన సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.


