News December 28, 2024

మహబూబ్‌నగర్ పొలిటికల్ రౌండప్ @2024

image

పాలమూరు జిల్లా కాంగ్రెస్‌కు 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు 12 చోట్ల గెలవడంతోపాటు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. జిల్లాకు సీఎం, మంత్రి పదవితోపాటు దక్కడంతో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS అల్లంపూర్, గద్వాలలో గెలవగా ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు.

Similar News

News December 29, 2024

NRPT: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వాలి’

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 15 పెండింగ్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందాల్సి ఉందని డిఎస్పీ లింగయ్య తెలిపారు.

News December 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS.!

image

✔మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు✔రేపు సెమిస్..MBNR❌ సెమిస్..MBNR❌ ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔నల్లమల సఫారీలో పెద్దపులి✔నేటి నుంచి APGVB సేవలు బంద్✔రేపు పలు గ్రామాల్లో కరెంట్ బంద్✔వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా✔కల్వకుర్తి:పచ్చ జొన్నల పేరుతో మోసం✔వనపర్తి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్✔దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు:NRPT డీఎస్పీ

News December 28, 2024

MBNR: మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు

image

భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. MBNRలోని మూఢ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూడ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.