News March 19, 2025
మహబూబ్‌నగర్: ‘బీసీ బిల్లు రాజ్యాధికారానికి తొలిమెట్టు’

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీసీ సంఘాల ముఖ్యపాత్ర ఉందని బీసీ ఐక్యవేదిక ఉద్ఘటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ MBNRలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 19, 2025
MBNR: GREAT.. ఓపెన్‌లో GOVT జాబ్ కొట్టాడు..!

TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో పాలమూరు విశ్వవిద్యాలయం పరిధి గద్వాలలోని పీజీ సెంటర్‌లో 2017-2019లో MA తెలుగు పూర్తి చేసిన S.రాకేశ్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటి ఓపెన్‌లో ఉద్యోగం సాధించారు. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC), ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ రాకేశ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా.సంధ్యారాణి పాల్గొన్నారు.
News March 19, 2025
చిన్నారులపై స్పెషల్ ఫోకస్: మహబూబ్‌నగర్ కలెక్టర్

శిశు గృహాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండెజ్ ఫౌండేషన్, జీజీహెచ్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. చిన్నారులు ఇంటి వాతావరణం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశు గృహాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.
News March 19, 2025
వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ సేవలు: మహబూబ్‌నగర్ కలెక్టర్

ఇక నుంచి దివ్యాంగుల కోసం వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష సమావేశం 183 మందికి దివ్యాంగులకు రూ.16 లక్షల విలువైన సహాయ పరికరాలను ఉచితంగా అందజేశారు. అంగ వైకల్యం కలిగిన ఎంతోమంది తమ వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని కలెక్టర్ గుర్తు చేశారు.