News April 12, 2025
మహబూబ్‌నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్‌కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.
Similar News
News January 6, 2026
కల్లూరు: హోదా పెరిగినా.. వృత్తిని వదలని సర్పంచ్

పదవి వచ్చినా పాత వృత్తిని వదలక ఆదర్శంగా నిలుస్తున్నారు కల్లూరు మండలం తెలగవరం సర్పంచ్ యల్లమందల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘ సభ్యురాలైన ఆమె, కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కారం, పిండి మిల్లు నడుపుతున్నారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత కూడా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, తన వృత్తిని కొనసాగిస్తూనే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. శ్రమను నమ్ముకున్న ఆమె తీరును చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.
News January 6, 2026
పిల్లలకు బోటులిజం వస్తే ఏమవుతుందంటే?

ఇంఫాంట్ బోటులిజంలో పిల్లల కండరాలు బలహీనపడతాయి. చూపు మందగించడం, అలసట, నీరసం, సరిగ్గా ఏడవలేకపోవడం, పీల్చడం, మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టం కలగవచ్చు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తేనెలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, పిల్లలకు అది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
News January 6, 2026
రేవంత్ వ్యాఖ్యలు: రాయలసీమలో టీడీపీ vs వైసీపీ

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు కారణం అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను వైసీపీ అస్త్రంగా చేసుకుని కూటమిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాయలసీమకు సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని.. రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ పనులు జగన్ హయాంలోనే NGT ఆదేశాలతో ఆగిపోయాయని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.


