News March 21, 2025
మహబూబ్‌నగర్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం MBNRలోని జేజేఆర్ ఫంక్షన్ హాలులో జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.
Similar News
News March 22, 2025
ట్రాన్స్‌జెండర్ MURDER.. మహబూబ్‌నగర్‌లో నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాన్స్‌జెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు సుకన్య మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష మాని, తమ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ట్రాన్స్‌జెండర్ హత్యకు కారణమైన నిందితుడిని ఉరితీసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News March 22, 2025
MBNR: ‘పల్లెల్లో అడుగంటిన అభివృద్ధి’

పాలమూరులో గడచిన 14 నెలలుగా గ్రామాల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి తెచ్చింది. గత 14 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి అడుగంటి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు,పారిశుద్ధ్యం, మురుగు, తాగునీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News March 22, 2025
MBNR: పరిశ్రమల అనుమతులు తక్షణమే మంజూరు: కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖలు మంజూరు చేయ్యాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదికారులను ఆదేశించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.