News April 6, 2025

మహబూబ్‌నగర్: ‘మా పోరాటం ఆగదు’

image

రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం మహబూబ్‌నగర్‌లో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టబద్ధ హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో మతపిచ్చి పట్టి మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.  

Similar News

News April 6, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్‌నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.

News April 6, 2025

మహబూబ్‌నగర్: శ్రీరాముని పాదం చూశారా?

image

MBNR జిల్లా కోయిలకొండలోని మహిమాన్విత క్షేత్రమైన శ్రీరామకొండ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదం స్వయంభుగా వెలసిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ తన పాదం మోపి సేదతీరినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్లే సమయంలో ఇక్కడ ఒక మూలికపడి కొండ మొత్తం వనమూలికలకు ప్రసిద్ధగా మారిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉండడం విశేషం. 

News April 6, 2025

మహబూబ్‌నగర్: నేడు శ్రీరామకొండకు వెళ్తున్నారా..?

image

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు. 

error: Content is protected !!