News January 31, 2026
మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ నిఘా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వన్ టౌన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం సందర్శించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ ప్రత్యేక నిఘా కొనసాగించాలని, భద్రతలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News January 31, 2026
MBNR: ఫిబ్రవరి 4న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబిన్ ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ శనివారం సభా స్థలాన్ని పరిశీలించి, జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబిన్ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
News January 31, 2026
MBNR: నేడు స్కూటీని.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్‌కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.
News January 31, 2026
MBNR: చెరువులో విషాదం.. వెలికితీసిన మృతదేహం

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల చెరువులో గల్లంతైన తిమ్మాజీపేట మండలం మామిడిచెట్టు తండాకు చెందిన రమేష్ మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఇనుము కోసం చెరువులోకి వెళ్లి రమేష్ గల్లంతవగా, అగ్నిమాపక శాఖ అధికారి రాజేందర్ బృందం గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


