News March 21, 2025

మహబూబ్‌నగర్: మొదటి పరీక్షకు 41 మంది గైర్హాజరు 

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నేటి పరీక్షకు 12,785 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మొత్తంగా 99.98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా నేడు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.

News October 29, 2025

దేవరకద్ర: చేప పిల్లలను వదిలిన మంత్రి, ఎమ్మెల్యే

image

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి విమర్శించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్‌తో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవరకద్రలో ఈసారి 82 మిల్లీమీటర్ల సైజులో 2.5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. రంగంలోకి ఎస్పీ

image

గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయబోలి ట్యాంకుబండు, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్–రాయచూరు రహదారి ప్రాంతాలను సమీక్షించారు. మున్సిపల్, ఇరిగేషన్, వన్ టౌన్ CI అప్పయ్య తదితర అధికారులతో కలిసి నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు.