News October 9, 2025
మహబూబ్‌నగర్: యువ జంట సూసైడ్

భూత్పూర్ మం. కొత్తూరులో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. కొత్తూరుకు చెందిన రమేశ్(28)కు జూన్‌లో గోపాల్పేట మం. చీర్కేపల్లి వాసి నిర్మల(22)తో వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులు.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. నిర్మల నేలపై పడి ఉండగా.. రమేశ్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 9, 2025
తూ.గో జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు

ఏపీ ఎన్జీవో సంఘం తూర్పుగోదావరి జిల్లాఅడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రోటరీ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమావేశంలోఅడహాక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కో ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, కన్వీనర్‌గా అనిల్ కుమార్, ఆర్థిక సభ్యుడిగా సత్యనారాయణ రాజు, సభ్యులుగా వెంకటేశ్వరరావు, నందీశ్వరుడు, ఎస్ వెంకటరమణ ఎన్నికయ్యారు.
News October 9, 2025
‘మద్యం తాగి వీరంగం ..45 రోజులు జైలు శిక్ష’: SKLM SP

మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన తమిరి సాయి (24)కి కోర్టు 45 రోజుల జైలు శిక్ష విధించారని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. సాయి అనే యువకుడు మద్యం తాగి పోలీసులకు పట్టుబడి వీరంగం చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. SKLM సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారించి జైలుశిక్ష విధించింది.
News October 9, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు

ప్రసారభారతి 59పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/