News January 24, 2026
మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.
Similar News
News January 28, 2026
కురుమూర్తి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు ప్రారంభం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ శివారులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు దాతల సహకారంతో బుధవారం ప్రారంభించారు. దేవాలయం ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సత్యనారాయణ, శ్రీనివాసులు ఆలయ సిబ్బంది ఆర్.శివానంద చారి, భాస్కర చారి తెలుగు శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
News January 28, 2026
MBNR: పుర పోరు..అభ్యర్థుల డిపాజిట్ ఇలా..!

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో పోటీచేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,250,ఇతరులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీచేసే రిజర్వ్డ్ కేటగిరీఅభ్యర్థులు రూ.2,500, జనరల్ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పొందే అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణపత్రాన్ని జతచేయాలి.
News January 28, 2026
నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సలు.. వాహనాల నియంత్రణ

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ శ్రీ అళహరి మధుసూదన్ Way2News తెలిపారు. భక్తులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలుపాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


