News February 20, 2026

మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు

image

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్ నుంచి రాజ్‌కోట్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నంబరు 09576 గల ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల 3న మహబూబ్‌నగర్‌లో బయలుదేరి జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ స్టేషన్ల మీదుగా రాజ్‌కోట్‌కు చేరుకుంటుందని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, అదనపు రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 20, 2026

బొబ్బిలి: గంజాయితో పట్టుబడ్డ విద్యార్థులు?

image

బొబ్బిలి మండలం ఓ గ్రామంలో గురువారం గంజాయితో విద్యార్థులు పట్టుబడినట్లు సమాచారం. కళాశాల వద్ద గంజాయి తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని 4 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ సీనియర్ విద్యార్థులే ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతుంది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

News February 20, 2026

తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

image

తిరుమలలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు తణుకునకు చెందిన లక్ష్మీ,రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ, అశ్వినీలతో ఈ నెల 16న తిరుమల వచ్చారు. బాలికలు ఆడుకుంటూ ఉండగా అన్నమయ్య జిల్లాకు చెందిన గుండ్లూరు శివమ్మ వారిని అపహరించి తన వెంట తీసుకుపోయింది. తిరుమల పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించి 17న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని చిన్నారులను అప్పగించారు.

News February 20, 2026

నిజామాబాద్ కా ‘రాణి’..!

image

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్‌కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్‌రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.