News April 25, 2025
మహబూబ్‌నగర్: 108, 102 అమ్మ ఒడి వాహనాల ఆకస్మిక తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో వివిధ 108 వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఫ్లీట్ హెడ్ గిరీశ్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో రికార్డులను, పరికరాల పనితీరు, 102 అమ్మ ఒడి సిబ్బంది పనితీరు, వాహన నిర్వహణను పరిశీలించి సేవలను ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లా పోగ్రామ్ మేనేజర్ రవి, జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
News April 25, 2025
HYDలో అమాంతం పెరిగిన విద్యుత్ డిమాండ్..!

HYDలో ఎండలు తీవ్రంగా ఉండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గురువారం 4 గం.కు 4,170 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఇది ఈ సీజన్‌లో తొలిసారి 4 వేల మెగావాట్లను దాటింది. గతేడాది ఇదే సమయంలో 3,886 మెగావాట్లు మాత్రమే నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ఎండల ప్రభావంతో కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడటంతో డిమాండ్ ఎక్కువగా నమోదవుతోంది.
News April 25, 2025
EAPCET ప్రవేశ పరీక్షకు 3 లక్షలకుపైగా దరఖాస్తులు

జేఎన్టీయూ నిర్వహిస్తున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు 3,06,796 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 2,20,049 దరఖాస్తులు రాగా అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి 86,493 వచ్చాయని 2 కలిపి 254 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈనెల 29, 30వ తేదీన పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.