News March 28, 2025

మహబూబ్‌‌నగర్ TO తాండూర్ రూట్‌లో కొనసాగుతున్న పనులు

image

మహబూబ్‌నగర్ నుంచి తాండూర్ వెళ్లే రూట్‌లోని ఇబ్రహీంబాద్ వద్ద రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. చకచకా పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.  

Similar News

News March 31, 2025

MBNR: రంజాన్‌కు భారీ బందోబస్తు: SP 

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ నేపథ్యంలో నేడు ఈద్గా, మసీద్‌లలో పెద్ద ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

News March 31, 2025

గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

image

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.

News March 31, 2025

WOW: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ విద్యార్థిని

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కర్ని (ZPHS) పాఠశాల విద్యార్థిని వై.శశిరేఖ 57వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ బి.రూప తెలిపారు. జనవరి 9, 10, 11న వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఒడిశాలోని పూరిలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటయ్య,ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATS❤

error: Content is protected !!