News April 15, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందటం జరిగింది. జిల్లా కేంద్రం సమీపంలో దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపలు పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలు కావడం విశేషం.
Similar News
News April 16, 2025
మహబూబ్‌నగర్: ‘ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి’

పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
News April 16, 2025
MBNR: ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అంబేడ్కర్ కళాభవన్‌లో తన సొంత నిధులతో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో HYDకు దీటుగా కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. కోచింగ్‌కు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి మంచి స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామన్నారు.
News April 16, 2025
నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.