News January 30, 2025

మహబూబ్ నగర్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✓నేటి ఉదయం 11 గంటలకు క్లాక్ టవర్ కూడలిలో బీఆర్ఎస్ నిరసన ✓ఉదయం 10 గంటలకు డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ✓జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో పర్యటించనున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ✓కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జడ్చర్లలో బీఆర్ఎస్ నిరసన ✓మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు నేడు సెలవు

Similar News

News April 25, 2025

వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

image

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.

News April 25, 2025

MBNR: బిల్డింగ్‌పై మృతదేహం కలకలం..!

image

ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన MBNRజిల్లా అడ్డాకులలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి షేక్‌బాలీ కుమారుడు ముస్తాక్(37) మద్యానికి బానిసై ఇంటికి రాకుండా కొన్నాళ్లుగా నిర్మాణంలోని ఓ బిల్డింగ్‌పై పడుకుంటున్నాడు. గురువారం ఓ కుక్క మనిషి చేతిని నోట కరుచుకుని రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు చూసి పోలీసులకు చెప్పారు. వారొచ్చి బిల్డింగ్‌పై చూడగా ముస్తాక్ శవం కుళ్లిపోయి కనిపించింది.

News April 25, 2025

‘MBNR జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి’

image

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.

error: Content is protected !!