News June 18, 2024

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా జానకి ధరావత్ నేపథ్యం!

image

మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీగా జానకి ధరావత్ రానున్నారు. ఎస్పీ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2007లో 6 నెలల పాటు ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేసిన ఆమెకు MBNRపై అవగాహన ఉంది. 2013లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.

Similar News

News March 4, 2026

మహబూబ్‌నగర్: రేపు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్!

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

News March 4, 2026

పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్‌ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

News March 3, 2026

జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

image

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.