News March 1, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
Similar News
News March 1, 2025
MBNR జిల్లా కలెక్టర్‌కు సీఎస్ కీలక ఆదేశాలు జారీ.!

మార్చి 5 నుండి 25 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణపై విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
News February 28, 2025
MBNR: ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు: కలెక్టర్

LRS కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31లోగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. LRS దరఖాస్తులపై చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. గడువులోగా పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీనిస్తుందని, ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని తమ ప్లాట్లను క్రమ బద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
News February 28, 2025
దేవరకద్రలో రోడ్డు ప్రమాదం

దేవరకద్రలో బ్రిడ్జి వద్ద స్కూటీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న కౌకుంట్ల మండలం రాజోలి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.