News July 5, 2025

మహబూబ్ నగర్: IIIT.. టాప్ విద్యార్థులు వీళ్లే!

image

మహబూబ్‌నగర్‌లో IIIT క్యాంపస్ నూతనంగా ఏర్పాటు చేశారు. నిన్న విడుదల చేసిన క్యాంపస్ ఎంపిక ఫలితాల్లో హర్షిత(574) సంగారెడ్డి, నిహారిక(572) నారాయణపేట, శ్రీవిద్య(570) నిజామాబాద్, హాజీబేగం(569) సంగారెడ్డి, మొహమ్మద్‌ గులాం సాధిక్‌(568) జనగామ టాపర్లుగా నిలిచారు. ఉమ్మడి జిల్లాల్లో
MBNR-20, NGKL-21, GDWL-6, WNPT-4, NRPT-15 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

Similar News

News July 5, 2025

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు క‌లెక్ట‌ర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

News July 5, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

image

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2025

PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

image

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.