News April 7, 2024

మహబూబ్ నగర్: UPDATE: గన్‌తో కాల్చుకొని AR SI సూసైడ్?

image

హైదరాబాద్‌లోని‌ కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్‌ (48)‌ విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్‌ గన్‌తో సూసైడ్‌ చేసుకొన్నారు.‌ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 21, 2025

నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

image

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.

News April 21, 2025

MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డాకుల 20.5 మిల్లీమీటర్లు, మిడ్జిల్ మండలం దోనూరు 14.3 మిల్లీమీటర్లు, మూసాపేట మండలం జానంపేట 6.0 మిల్లీమీటర్లు, కౌకుంట్ల 3.8 మిల్లీమీటరు బాలానగర్ మండలం ఉడిత్యాల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో వరి కోతలకు పొలం తడి ఆరడం లేదన్నారు.

News April 21, 2025

MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 43.3 డిగ్రీలు, నవాబుపేట 43.2, అడ్డాకుల 42.5, మహమ్మదాబాద్ 42.4, దేవరకద్ర 41.8, చిన్నచింతకుంట మండలం నంది వడ్డేమాన్ 41.6, కౌకుంట్ల 41.3, కోయిలకొండ మండలం పారుపల్లి 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

error: Content is protected !!