News February 19, 2025

మహమ్మద్ నగర్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్ నగర్‌లో జరిగింది. SI శివకుమార్ వివరాలిలా.. మోహన్ (28) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయి, స్మశాన వాటిక వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు కేసు నమోదైంది.

Similar News

News February 21, 2025

22న కుప్పానికి హైపర్ ఆది రాక 

image

ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమానికి ఆదితోపాటూ, మరో నటుడు రాంప్రసాద్ సైతం వస్తున్నారు. 

News February 21, 2025

సిద్దిపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు అన్నారు. సిద్దిపేట బ్లాక్ 16 మండలాలు, 3 మున్సిపాలిటీల డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన JMLBC/ BLBC సమావేశాలు సిద్దిపేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయన వెంట NABARD DDM నికిల్ రెడ్డి, పశువైద్య శాఖ JD వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News February 21, 2025

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: కిషన్ రెడ్డి

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జారుతున్నాయని, ఆ  స్థానాల్లో బీజీపీ పోటీ చేస్తుందని, ఈ మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!