News October 8, 2024
మహాకాళి అవతారంలో గంభీరంగా దర్శనమిస్తున్న అమ్మవారు
వరంగల్ నగరవ్యాప్తంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గాదేవి ప్రతిమలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి అవతారంలో గంభీరంగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
Similar News
News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.
News November 25, 2024
వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద
గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
News November 24, 2024
WGL: దీక్షా దివస్ సందర్భంగా ఇన్‌ఛార్జుల నియామకం
నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్ నిర్వహణలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు తెలిపారు.
భూపాలపల్లి-ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్,
వరంగల్-మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి,
హనుమకొండ-ఎమ్మెల్సీ వాణిదేవి,
జనగామ-మాజీ MLA బిక్షమయ్యగౌడ్,
మహబూబాబాద్-మాజీ MLA కొండా బాలా కోటేశ్వర్‌రావు