News February 6, 2025

మహాకుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం ఆయన ప్రకటించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 6, 2025

భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

image

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్‌, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.

News February 6, 2025

ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

image

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.

News February 6, 2025

చెరుకుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. రాజోలు గ్రామానికి చెందిన ముచ్చు నాగార్జున్‌రెడ్డి బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొంది. అనంతరం అతన్ని ఆటో కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నాగార్జునరెడ్డి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుణ్ణి చెరుకుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!