News February 9, 2025

మహాదేవపూర్‌లో గుర్తుతెలియని మృతదేహం

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు మహాదేవపూర్ ఎస్ఐ పవన్‌కు సమాచారం అందించారు. ఆయన ఘటన స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News November 11, 2025

తిరుమల: ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

image

పరకామణి చోరీ కేసులో సోమవారం ముగ్గురు పోలీసులను CID బృందం విచారణ చేపట్టింది. కేసులో ఉన్న మాజీ CI జగన్ మోహన్ రెడ్డి, SI లక్ష్మీపతి, విజిలెన్స్ అధికారి గిరిధర్‌ను విచారించారు. కేసు సెక్షన్లు ఏవీ, ఎందుకు పెట్టారు, అరెస్టు ఎందుకు చేయలేదు, రాజీ ఎలా చేశారు, లోక్ అదాలత్‌లో ఎవరు చెబితే పెట్టారనే ప్రశ్నలు వేసి వారి సమాధానాలను రికార్డు చేశారు.

News November 11, 2025

HNK నుంచి తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

image

WGL జిల్లా భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నాయని టీజీఆర్టీసీ RM డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి హనుమకొండ బస్టాండ్‌ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలంకు, ఉదయం 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంకు, రాత్రి 11.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News November 11, 2025

తాకట్టు పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐకి భారీ జరిమానా

image

రుణం తీరినా ఆస్తి పత్రాలు ఇవ్వని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఎస్‌బీఐ బ్యాంకుపై కన్స్యూమర్ కోర్టు చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు.. పత్రాలు ఇచ్చేవరకు రోజుకు రూ.5 వేలు, మానసిక వేదనకు రూ.లక్ష, కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది.