News February 10, 2025

మహాదేవపూర్: చెరువులో పడి వ్యక్తి మతి

image

చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మహాదేవపూర్ మండలంలో జరిగింది. పోలీసుల కథనమిలా.. మండల కేంద్రంలోని ఎర్రచెరువుకు మేడం నాగేందర్ (46) బహిర్భూమి కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. మృతుడిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి అని తెలిపారు. మృతుడి భార్య అనితా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 28, 2026

సంగారెడ్డి: ప్రతి ఫిర్యాదునూ ఆన్‌లైన్ చేయాలి: ఎస్పీ

image

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ముఖ్యంగా సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో ముమ్మరంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

News February 28, 2026

కొత్తచెరువు: హంద్రీనీవా కాలువలో కొట్టుకు వచ్చిన వృద్ధుల మృతదేహాలు

image

కొత్తచెరువు మండలంలో చర్ల సమీపంలో హంద్రీనీవా కాలువలో వృద్ధుల మృతదేహాలు కొట్టుకు వచ్చిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎవరో గుర్తు తెలియని వృద్ధ దంపతులు అయ్యి ఉంటారని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధ మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదవశాత్తు కాలవలో పడ్డారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

News February 28, 2026

BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరలు మరోసారి షాకిచ్చాయి. HYD మార్కెట్‌లో ఉదయం 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.3,160 పెరగగా తాజాగా రూ.3,980 వృద్ధిచెంది రూ.1,68,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు మార్నింగ్ రూ.2,900 ఎగబాకగా, ఇప్పుడు రూ.3,650 పెరిగి రూ.1,54,650గా ఉంది. KG వెండిపై ఉదయం రూ.5వేలు, ఇప్పుడు రూ.20వేలు పెరిగి రూ.3,20,000కు చేరింది. శుభకార్యాలయాల వేళ ధరల పెరుగుదల సామాన్యులను కంగారుపెడుతోంది.