News September 15, 2024

మహానందిలో భక్తుల సందడి

image

మహానంది ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కొనసాగుతుంది. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాలు తిలకించారు.

Similar News

News February 15, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓవర్ స్పీడ్ 1,189, హెల్మెట్ లేకుండా 1,075, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 260 కేసులతో పాటు 1,069 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,908 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News February 15, 2026

కర్నూలుకు అన్యాయం

image

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు మళ్లీ మొండి చెయ్యి చూపారని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి ఆరోపించారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవన్నారు. కేవలం మరమ్మతుల కోసం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలకు నిధులు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు.

News February 14, 2026

కర్నూలు: ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో మోసం..వ్యక్తి అరెస్టు

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.