News April 15, 2025
మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
Similar News
News September 14, 2025
ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.
News September 14, 2025
AP న్యూస్ రౌండప్

*తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు UNESCO రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు.
*జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా 60,953 కేసులు పరిష్కారం, రూ.109.99 కోట్ల పరిహారం అందజేత.
*గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు. రెండు ఘటనల్లో నలుగురు మృతి.
*రేపు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలకు విద్యాశాఖ కసరత్తు.
*స్వచ్ఛాంధ్ర పురస్కారాలు.. తొలి విడతలో 16 విభాగాలకు 52 అవార్డులు.
News September 14, 2025
MDK: రూ.1,04,88,964 రికవరీ

లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడంతో డబ్బులు, విలువైన సమయం ఆదా అవుతుందని, రాజీతో ఇద్దరూ గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అన్నారు. MDKలో 4,987 కేసులు, SRDలో 4,334, SDPTలో 3,787 కేసులు పరిష్కారించినట్లు వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్& డ్రైవ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, E-పిట్టీ కేసులు, తగాదాలు తదితర కేసులను రాజీ కుదిర్చామన్నారు. MDKలో రూ.1,04,88,964 రికవరీ చేశారు.