News January 5, 2026

మహానందిలో సినీ దర్శకుడు ‘తేజ’ సందడి

image

ప్రముఖ దర్శకుడు తేజ సోమవారం మహానంది క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వర సమేత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్న తేజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తేజను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోనేరును సందర్శించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 21, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,580
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,334
* 10 గ్రాముల వెండి ధర రూ.2,680.

News February 21, 2026

చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News February 21, 2026

సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

image

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.