News January 25, 2025
మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.
Similar News
News January 26, 2025
12 రోజుల్లో రూ.260కోట్లకు పైగా కలెక్షన్స్
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక ప్రాంతీయ సినిమాకు ఇవే అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
News January 26, 2025
సిరిసిల్ల: జెండాను ఆవిష్కరించిన ఎస్పీ
సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు చేసిన కృషి ఫలితంగానే మనకు రాజ్యాంగం అవతరించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పిలు శేషాద్రి రెడ్డి, చంద్రయ్య, డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఐలు రమేష్, మధుకర్, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
News January 26, 2025
గద్వాల: నేడు నాలుగు పథకాలకు శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాలను జోగులాంబ గద్వాల జిల్లాలోని గ్రామాల్లో ప్రారంభించనున్నారు. ధరూర్-అల్లాపాడు, కేటిదొడ్డి-ఉమీత్యాల, గట్టు-ఆరగిద్ద, గద్వాల- నల్ల దేవుని పల్లి, అల్లంపూర్-గొందిమల్ల, మానవపాడు-చంద్రశేఖర్ నగర్, రాజోలి-తూర్పు గార్లపాడు, బస్వాపుర-బస్వాపురం, వడ్డేపల్లి- కోయిల్దిన్నె, మల్దకల్-సుగురుదొడ్డి, ఐజ-పట్టకనూగోపాల్దిన్నె- గోపాల్దిన్నె, ఎర్రవల్లి- బట్లదిన్నే.