News February 15, 2025

మహానంది: ఆకతాయికి వారం రోజుల జైలు శిక్ష

image

మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ సింగ్ మద్యం తాగి ఈ నెల 12న దారిలో వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారం రోజుల జైలుశిక్ష విధించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నిందితుడిని సబ్ జైలుకు తరలించామని అన్నారు.

Similar News

News September 17, 2025

ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

image

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.

News September 17, 2025

ఎన్టీఆర్: అమరావతి అసైన్డ్ రైతులకు ఊరట

image

రాజధాని అమరావతికి భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. CRDA వీరికిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో “అసైన్డ్” అనే పదం తొలగించి పట్టా భూమి అనే పేర్కొంటామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల చంద్రబాబును కలసిన రైతులు అసైన్డ్ అని ఉన్న కారణంగా తమ ఫ్లాట్లకు తక్కువ ధర వస్తోందని చెప్పగా..సీఎం చంద్రబాబు ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

News September 17, 2025

KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

image

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.