News February 17, 2025

మహానందీశ్వరుని కళ్యాణం.. LATEST PHOTO

image

మహానంది శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు ఆదివారం వైభవంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, పండితులు, అర్చకులు అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మాంగళ్య ధారణ, అక్షింతలు సమర్పణ పూజలు శాస్త్రోక్తంగా చేశారు.

Similar News

News December 17, 2025

జైపూర్ సర్పంచ్‌గా భాస్కర్ గెలుపు

image

జైపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కూన భాస్కర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

News December 17, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.

News December 17, 2025

‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

image

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.