News April 6, 2026
మహాలక్ష్మి పథకం.. ఓరుగల్లులో 22 కోట్ల టికెట్లు జారీ

టీజీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోల ద్వారా ఇప్పటివరకు 22 కోట్లకు పైగా మహిళలకు ఉచిత టికెట్లు జారీ చేశారు. హనుమకొండ 4.47, తొర్రూర్ 2.00, వరంగల్-2 డిపో 1.90, పరకాల 2.10, జనగామ 3.24, మహబూబాబాద్ 1.97, నర్సంపేట 2.49, వరంగల్ 1 డిపో 1.93, భూపాలపల్లి 1.98 కోట్ల మహిళలు ప్రయాణించారని, 100% ఆక్యుపెన్సీ రేషియో అధిగమించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Similar News
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News April 15, 2026
IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.
News April 15, 2026
GNT: మహిళ హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

తీసుకున్న డబ్బు చెల్లించమని అడిగిన మహిళను హత్య చేసిన లాయర్‌తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతగుంటూరుకు చెందిన రమాదేవి(46)వద్ద లాయర్ సురేశ్ రూ.10లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని ఇప్పించకుండా మోసంచేశాడు. తిరిగి చెల్లించమని అడిగితే డబ్బులు ఇస్తానని పిలిచి ఫిబ్రవరి 16న సంగజాగర్లమూడి వద్ద పంట కాలువలోకి తోసి చంపేశారు. సురేశ్‌తోపాటు అతని స్నేహితుడు శేఖర్‌ని అరెస్ట్ చేశారు.


