News December 18, 2024
మహాలక్ష్మీ పథకానికి అప్లై చేసుకోండి: కలెక్టర్ త్రిపాఠి

తెల్లరేషన్ కార్డు ఉండి మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి గతంలో అప్లై చేయని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దరఖాస్తుతో పాటు, ఎల్పీజీ వినియోగదారు నంబరు, ఆధార్ కార్డు వివరాలు, జిరాక్స్, ఎల్పీజీ గుర్తింపు ధ్రువపత్రాలతో అప్లై చేయాలన్నారు.
Similar News
News November 1, 2025
చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.
News November 1, 2025
జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
News November 1, 2025
పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


