News February 11, 2025
మహాశివరాత్రి ఏర్పాట్ల సమీక్ష లో పాల్గొన్న మంత్రి అనగాని

శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రులతో కలిసి ఏర్పాట్లలో చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 26, 2025
విద్యార్థులు తప్పక వీక్షించాలి: తిరుపతి DEO

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందనితిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.
News December 26, 2025
మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.
News December 26, 2025
పాఠశాలల్లో హౌస్ సిస్టం ఏర్పాటు చేయాలి: డీఈఓ

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మరియు కేజీబీవీలలో ‘హౌస్ సిస్టం’ ఏర్పాటు చేయాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. దీని కోసం ప్రతి పాఠశాల ఖాతాలో రూ. 6,250 జమ చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరినీ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అనే నాలుగు హౌస్‌లుగా విభజించాలని, విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచి, పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడం చేయాలన్నారు.


