News February 10, 2026
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సీఎం సమీక్ష

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి ఆయన భక్తుల రద్దీ, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనితలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. శివదీక్ష మాలధారుల పట్ల ఎవరూ అగౌరవంగా వ్యవహరించకూడదని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News February 10, 2026
ఏలూరు: వివాహిత అనుమానాస్పద మృతి

మండవల్లి మండలంలోని నాగభూషణపురంలో వివాహిత మేఘన మంగళవారం అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందారు. ఛాతీనొప్పి రావడంతో కైకలూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు.
News February 10, 2026
489 మంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు

కాకినాడ జిల్లాలో రెండు విడతల్లో అర్హులైన 489 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 237, మంగళవారం మరో 252 మందికి అక్రిడేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించని 59 దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు.
News February 10, 2026
SVU : డిగ్రీ పూర్వ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.


