News February 25, 2025

మ‌హా శివ‌రాత్రి పుణ్య స్నానాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈ నెల 26న మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా పెద్దసంఖ్య‌లో భ‌క్తులు కృష్ణాన‌దిలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల‌ను ద‌ర్శించుకోనున్న నేప‌థ్యంలో ఆల‌యంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వీఎంసీ, మ‌త్స్య‌, ఇరిగేష‌న్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌కు ఏర్పాట్ల‌పై మార్గ‌నిర్దేశ‌నం చేశారు.

Similar News

News February 25, 2025

విశాఖ: ఈనెల 27న పారిశుద్ధ్య కార్మికులకు సెలవు

image

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కార్మికులు విధులకు హాజరై యథావిధిగా వ్యర్థాలను సేకరిస్తారని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ తెలిపారు. దీంతో వారికి ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఫిబ్రవరి 27వ తేదీన వ్యర్థాలను వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ బిన్లలో పడేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 28న(శుక్రవారం) పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు.

News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 25, 2025

జగిత్యాల: స్త్రీ నిధి రుణాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి : డీఆర్‌డీవో

image

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న స్త్రీ నిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు సెర్ప్ సిబ్బంది కృషిచేయాలని డీఆర్‌డీవో రఘువరన్ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెర్ప్ అధికారుల జిల్లాస్థాయి సమావేశం జరిగింది. స్త్రీ నిధి జోనల్ మేనేజర్ రవికుమార్ జిల్లాలోని రుణాల గురించి వివరించారు. డీపీఎం మాణిక్ రెడ్డి, భారతి ఉన్నారు.

error: Content is protected !!