News February 4, 2025

మహిళను బెదిరించి డబ్బులు వసూలు..  నిందితుడు అరెస్ట్

image

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన మహిళను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రూ.కోటి 81 లక్షల విలువ గల స్థిర, చర ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News February 4, 2025

తూ.గో: ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభమవ్వాలి- కలెక్టర్

image

తీర ప్రాంతం దాటి ఉన్న ఇసుక రీచ్‌ తవ్వకాలు బుధవారం నుంచి ప్రారంభించేలా సమన్వయ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్‌లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 8,62,719 లభ్యత ఉందన్నారు.

News February 4, 2025

రాజమండ్రి: ‘రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు’ 

image

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం పేర్కొన్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ కంటే 11 శాతం ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 స్టేషన్ల రూపురేఖలు మార్చేదిశగా ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రూ.8,455 కోట్లు రైల్వే ప్రాజెక్టులు రావడం హర్షణీయమన్నారు.

News February 4, 2025

తూ.గో: ‘మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి’

image

జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి చింతాడ లావణ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా 13 షాపులలో జిల్లాకలెక్టర్, బీసీవెల్ఫేర్‌ ఆఫీసర్, బీసీ కులసంఘాల ప్రతినిధుల సమక్షంలో తీసిన లాటరీలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్‌ కులానికి కేటాయించడం జరిగిందన్నారు.

error: Content is protected !!