News August 24, 2025
మహిళలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు: జితేంద్ర

షెడ్యూల్డ్ కులాల మహిళలకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి జితేంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 సంవత్సరాలలోపు GNM/B.Sc నర్సింగ్ అర్హత కలిగి వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30 లోగా jdswguntur@gmail.com మెయిల్ ఐడీలో సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలన్నారు.
Similar News
News August 24, 2025
హెవీ మోటర్ డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులకు హెవీ మోటార్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని కార్యనిర్వాహక సంచాలకుడు కుముద తెలిపారు. 20 ఏళ్ల వయస్సు పైబడిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 27వ తేదీలోగా అనంతపురంలోని ఎస్సీ కార్పొరేషన్ (పెన్నార్ భవన్)లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి, అనంతరం ఆర్టీసీలో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు.
News August 24, 2025
HMS గౌరవ అధ్యక్షురాలిగా కవిత?

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నారు.
News August 24, 2025
PDPL: 26న విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆగస్టు 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్‌కామ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరుగుతుందని జిల్లా పరిశ్రమల అధికారి ఏ.కీర్తికాంత్ తెలిపారు. జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్, ఫిజీ, గ్రీస్, పోర్చుగల్, యుఏఈ తదితర దేశాల్లో వివిధ ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆసక్తిగల నిరుద్యోగులు హాజరై నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.