News March 18, 2025
మహిళలకు రక్షణగా శక్తి యాప్: జిల్లా ఎస్పీ

మహిళలకు శక్తి యాప్ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో మహిళలకు శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.
News September 19, 2025
అల్లూరి జిల్లాలో 3,200 పిల్లలకు పౌష్టికాహార లోపమా..?

అల్లూరి జిల్లాలో మొత్తం 3314 అంగన్వాడీ కేంద్రాల్లో 3,200 మంది బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఉన్నారని ICDS. PD. జాన్సీ రామ్ అన్నారు. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని ICDS కార్యక్రమాల్లో ఆమె గురువారం పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నా వీరందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ప్రత్యేకమైన ఆహరం అందిస్తున్నామని తెలిపారు.
News September 19, 2025
HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?