News November 13, 2024

మహిళలకు రక్షణ భరోసా కేంద్రాలు: డీకే అరుణ

image

భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. షీటీం ఆధ్వర్యంలో మంగళవారం MBNRలోని మోనప్పగుట్టలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో MP పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల, బాలల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, MLA శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర, SP జానకి పాల్గొన్నారు.

Similar News

News November 14, 2024

లగచర్ల ఇష్యూ.. ఈ మండలాల్లో ఇంటర్నెట్ బంద్!

image

కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.

News November 13, 2024

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ

image

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.

News November 13, 2024

లగచర్ల దాడిలో 16 మంది అరెస్టు..

image

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల దాడిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా.. అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. దీని తరువాత కొడంగల్ మెజిస్ట్రేట్‌లో హాజరు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.