News August 26, 2025
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించాలి: కలెక్టర్

మహిళలు వివిధ రంగాలలో స్వయం ఉపాధి పొందేలా అవసరమైన శిక్షణలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సారంగాపూర్ మండలం చించోలి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతున్న శిక్షణలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
Similar News
News August 27, 2025
NZB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19-45 సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి డిచ్‌పల్లిలోని RESTI ఆఫీసును సంప్రదించాలన్నారు.
News August 27, 2025
NZB: జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి వినోద్ తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో మహిళ జట్టు ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సౌమ్యారాణి, శృతి, అనూష, శరణ్య, పురుషుల విభాగంలో సాయి కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
News August 27, 2025
గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల అటవీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకం కింద ఈ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.