News February 2, 2025

మహిళలను వేధింపులకు గురి చేస్తే చర్యలు: ఎస్పీ

image

మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షీ టీమ్స్ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరిలో ఆకతాయిలపై రెండు కేసులు నమోదు చేశామని, తూప్రాన్ సబ్ డివిజన్లో 11 మంది, మెదక్‌లో 18 మందిని కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు.

Similar News

News November 6, 2025

నిజాంపేట: ALERT.. లింక్ క్లిక్ చేస్తే రూ.45 వేలు మాయం

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు పోయినట్లు ఎస్ఐ తెలిపారు. సెల్ ఫోన్‌లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

News November 5, 2025

మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.