News October 19, 2025
మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్‌తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.
Similar News
News October 21, 2025
ఖమ్మం: పోలీసు అమరులకు సెల్యూట్.. త్యాగం గొప్పది

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం గొప్పదని ఖమ్మం, భద్రాద్రి జిల్లా వాసులు స్మరించుకుంటున్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు వారికి నివాళులు అర్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నక్సలైట్ల దాడుల్లో అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. 1997లో కరకగూడెం ఠాణాపై దాడిలో 16 మంది, 1991లో రాళ్లవాగు, 1992లో మోతుగూడెం ఘటనల్లో అమరులైన వారి సేవలు భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
News October 21, 2025
గోదావరిఖనిలోనూ నిజామాబాద్ తరహా ఎన్‌కౌంటర్..!

NZBలో రియాజ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. అచ్చం ఇలాంటి ఘటనే 2012లో గోదావరిఖనిలో జరిగింది. 2012 JUN 11న పోలీసులపై తిరగబడ్డ రౌడీషీటర్ కట్టెకొల సుధీర్‌ను కాల్చిచంపారు. ఓ కేసు విషయంలో RGM మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు సుధీర్‌ను అరెస్ట్ చేయడానికి యత్నిస్తుండగా అతడు పోలీసులపై తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో సుధీర్ చనిపోయాడు.
News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.