News April 4, 2025
మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News April 11, 2025
నేటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 10వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండిలో తలపడనుంది. వచ్చే నెల 18 వరకు ఈ సీజన్ జరగనుంది. ఆరు జట్లు మొత్తం 34 మ్యాచులాడతాయి. కరాచీ కింగ్స్‌కు డేవిడ్ వార్నర్ ఆడనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది.
News April 11, 2025
కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
News April 11, 2025
అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన గరివిడి క్రీడాకారులు

నేపాల్‌లో జరిగిన క్రీడల్లో గరివిడికి చెందిన క్రీడాకారులు రమణీ ప్రియ మహిళా విభాగం పవర్‌లిఫ్టింగ్‌లో 330 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం గెలిచారు. అథ్లెటిక్స్‌లో షార్ట్ పుట్, డిస్క్ త్రోలో బంగారు పతకాలు సాధించారు. పురుషల విభాగం వై.వి. ప్రసాద్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్వర్ణం, 50 మీటర్ల ఈత పోటీల్లో స్వర్ణం, 100 మీటర్ల ఈత పోటీల్లో రజతం సాధించారు.