News February 4, 2025

మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యం: ASF SP

image

జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 4, 2025

మార్చ్ 12న PGECET- 2025 నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ -2025 నోటిఫికేషన్‌ను మార్చు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. దీనిలో భాగంగా నేడు కమిటీ మీటింగ్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చ్ 17 నుంచి మే 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

News February 4, 2025

NZB: త్రిపుర గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం

image

సీసీఆర్‌టీ ట్రైనింగ్‌లో భాగంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని తెలియజేస్తున్న సీసీఆర్టీ బృందాన్ని గవర్నర్ సన్మానించారు. ఈ బృందంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు కలే గోపాల్, ప్రసన్న మాలిగిరెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?

image

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.