News November 8, 2025
మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.
Similar News
News November 8, 2025
మురికి కాలువల పక్కన కొత్త ఇల్లు కట్టొచ్చా?

మురికి కాలువల సమీపంలో ఇల్లు కట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. మురికి కాలువల వల్ల అపరిశుభ్రత, కాలుష్యం పెరిగి, దుర్గంధం కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన సూచన. ‘నివాస స్థలంలో శుభ్రత, స్వచ్ఛత లేకపోతే అక్కడ సానుకూల శక్తి నిలవదు. అందుకే శుభ్రత, ప్రశాంతత ఉండే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి’ అని వాస్తు శాస్త్రం చెబుతోంది. <<-se>>#Vasthu<<>>
News November 8, 2025
చైతూ-సామ్ విడాకులకు రాజ్‌తో రిలేషనే కారణమా?

సమంత, డైరెక్టర్ రాజ్ క్లోజ్‌గా ఉన్న <<18231711>>ఫొటో వైరల్<<>> అవడంతో నాగచైతన్యతో ఆమె విడిపోవడానికి ఈ రిలేషనే కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైతూతో విడిపోకముందు రాజ్ డైరెక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మాన్-2’ సిరీస్‌లో సమంత నటించారు. అయితే ఆ సమయంలోనే రాజ్, సామ్ మధ్య రిలేషన్ ఏర్పడి ఉండొచ్చని, అదే చైతూ-సామ్ విడాకులకు కారణమని పలువురు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు సామ్‌కు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.
News November 8, 2025
శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ నిజాలు

AP: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణలో కీలక అంశాలు బయట పడుతున్నాయి. మోనో గ్లిజరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను వినియోగించి పామాయిల్‌గా మార్చి దాన్నే నెయ్యిగా లడ్డూ తయారీకి పంపారని సిట్ గుర్తించింది. బోలే బాబా డెయిరీలో తయారైన నెయ్యిలో 90 శాతం పామాయిల్ ఉన్నట్లు కనుగొంది. సబ్ కాంట్రాక్టర్ అజయ్ కుమార్, బోలే బాబా కంపెనీ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు సిట్ వర్గాలు పేర్కొన్నాయి.


