News March 12, 2025
మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎస్పీ

ఏ సమస్య వచ్చినా వాటిని మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. మంగళవారం చెన్నే కొత్తపల్లిలో టింబక్టు కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో జరిగిన మహిళా సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News February 28, 2026
వైభవంగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు పరకాల MLA ప్రకాశ్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని, కళ్యాణాన్ని వీక్షించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News February 28, 2026
ఖమ్మం: మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు నేడే లాస్ట్ డేట్

రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు https://tgms.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.
News February 28, 2026
భారీగా పడిపోయిన టమాటా ధరలు

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఉమ్మడి వరంగల్‌లో 25 కేజీల పెట్టె నవంబర్‌లో రూ.900 వరకు ఉండగా ప్రస్తుతం రూ.60-80 మాత్రమే పలుకుతోంది. అంటే కేజీకి రూ.2-3 మాత్రమే. రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు ఫ్రీగా పంచిపెడుతుంటే మరికొందరు చేనులోనే వదిలేస్తున్నారు. అటు ఏపీలోని మదనపల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక బహిరంగ మార్కెట్లో కేజీ రూ.5-10 వరకు అమ్ముతున్నారు.


