News January 27, 2026

మహిళలూ బంగారం జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో తరచుగా ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. బంగారం లాక్కొని పారిపోతున్నారు. దీంతో గోల్డ్ ధరించి బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి తర్వాత HYD పరిధిలో 8 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. జగిత్యాల, NZB, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. అందుకే బంగారంతో బయటకు వెళ్తే జాగ్రత్త.

Similar News

News February 17, 2026

భారీ జీతంతో SETలో ఉద్యోగాలు

image

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 సైంటిస్ట్ E, Fపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech, MSc(CS, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), ME/MTech/PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైంటిస్ట్ F పోస్టుకు నెలకు రూ.1.31L-రూ.2.16L, సైంటిస్ట్ E పోస్టుకు రూ. 1.23L-రూ.2.15L చెల్లిస్తారు.

News February 17, 2026

‘కర్తరీ’ అంటే అర్థం ఇదే..

image

కత్తెరను సంస్కృతంలో కర్తరీ అంటారు. కత్తెర ఎలా అయితే వస్తువులను రెండుగా కత్తిరిస్తుందో, అలాగే ఈ కాలంలో సూర్యుడి వేడి భూమిని కూడా అలా చీల్చేంత బలంగా ఉంటుందని భావన. సూర్యతాపం కత్తెర లాగా పదునుగా ఉండి, జీవరాశిని పీడించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మన పూర్వీకులు వాతావరణంలోని ఈ తీవ్రతను గమనించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ పేరును ఖరారు చేశారు. అందుకే ఈ కాలాన్ని కర్తరీ రోజులు అని పిలుస్తారు.

News February 17, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

శుభకార్యాల వేళ బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.2,840 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 పతనమై రూ.1,42,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.