News December 12, 2025
మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News December 12, 2025
అక్కడ ‘జాగృతి’ బోణీ.. ఇక్కడ 95 ఏళ్ల వయసులో సర్పంచ్!

TG: పంచాయతీ ఎన్నికల్లో కవిత నేతృత్వంలోని ‘తెలంగాణ జాగృతి’ బోణీ కొట్టింది. NZB(D) వీరన్నగుట్ట తండా, తాడ్‌బిలోలి పంచాయతీల్లో జాగృతి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అటు KCR దత్తత గ్రామం యాదాద్రి(D) వాసాలమర్రిలో ఓట్లు సమానంగా రావడంతో టాస్ వేయగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మరోవైపు SRPT(D) నాగారం సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి (వయసు 95 ఏళ్లు) ఎన్నికయ్యారు.
News December 12, 2025
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News December 12, 2025
BREAKING: మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని స్వగృహంలో ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ 2సార్లు MLA, ఏడుసార్లు MPగా గెలిచారు. ఇందిర, రాజీవ్, మన్మోహన్ క్యాబినెట్‌లలో డిఫెన్స్, సైన్స్ &టెక్నాలజీ, హోంమంత్రిగా పనిచేశారు. 10వ లోక్‌సభ స్పీకర్, పంజాబ్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.


