News October 8, 2025
మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి: హోంమంత్రి అనిత

విశాఖలో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో మహిళా భద్రత, సాధికారతపై సదస్సు జరిగింది. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యమని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ‘శక్తి యాప్’ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు, తోటి మహిళల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 8, 2025
జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్‌లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
News October 8, 2025
జగన్ విశాఖ పర్యటన ఒక జగన్నాటకం: ప్రణవ్ గోపాల్

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటన అల్లర్లు సృష్టించడానికేనని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. మెడికల్ కాలేజీలను మధ్యలోనే వదిలేసి, నిధులను పార్టీ ఆఫీసులకు మళ్లించారని ఆయన ఆరోపించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టడంపై ఉన్న శ్రద్ధ కాలేజీలపై లేదన్నారు. డాక్టర్ సుధాకర్ మృతికి, బీసీ నేతల వేధింపులకు కారణమైన జగన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత లేదని మండిపడ్డారు.
News October 8, 2025
వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన కుందు రామరావు

వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎంగా కుందు రామరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2006 IRSE బ్యాచ్‌కు చెందిన కుందు రామారావు భారత రైల్వేలోని వివిధ జోన్‌లలో కీలక హోదాల్లో సేవలందించారు. నాగ్‌పూర్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా, రాయ్‌పూర్‌లో సీనియర్ ఏడీఈఎన్‌గా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్‌లో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా, విజయవాడలో సీనియర్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు.